KKD: పదో తరగతి విద్యార్థులు నవంబర్ 30వ తేదీలోగా పరీక్ష రుసుం తప్పనిసరిగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ తెలిపారు. విద్యార్థుల నామినల్ రోల్స్ ను పాఠశాల యూడైస్ వివరాలతో ధ్రువీకరించుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆయన సూచించారు. యూడైస్, ఫీజులు,ఇతర సమస్యల పరిష్కారం కోసం 9959567275, 9490178184, 9951558185 నంబర్లను సంప్రదించాలని డీఈవో తెలిపారు.