PPM: గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రజల సహకారం అత్యవసరమని కురుపాం MPDO ఉమామహేశ్వరి సూచించారు. ఇవాళ స్దానిక ఏగులువాడలో పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటి ముందు పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులు, దోమల పెరుగుదల వంటి సమస్యలను నివారించవచ్చన్నారు. గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండడానికి ప్రజలకు సూచనలు, సలహాలు అందించామన్నారు.