E.D: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలు అమలు అవుతాయని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో ఇచ్చిన హామీలను, చట్టాలను బీజేపీ కూటమి ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.