KRNL: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పేపర్ లెస్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీ అభివృద్ధి కమిటీ సమావేశంలో నెక్ట్స్‌జెన్ సాఫ్ట్వేర్ వినియోగించి అన్ని సేవలను డిజిటలైజ్ చేయాలని సూచించారు.