VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మీ ఇవాళ స్దానిక గొల్ల వీధి, పల్లా వీధి, స్మశానం రోడ్డులో శానిటేషన్, అభివృద్ధి పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్లాక్ స్పాట్లను తొలగించి పరిశుభ్రతపై దృష్టీ పెట్టాలని, బావులలో క్లోరినేషన్ పూర్తి చేయాలని, స్మశానం రోడ్డులో నిర్మాణంలో ఉన్న కాలువలను నాణ్యతతో, వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.