కృష్ణా: పదో తరగతి విద్యార్థులు పరీక్ష రుసుమును నవంబర్ 30లోగా తప్పనిసరిగా చెల్లించాలని పెడన మండల విద్యాశాఖ అధికారి హరినాథన్ మంగళవారం తెలిపారు. విద్యార్థుల నామినల్ రోల్స్‌ను పాఠశాల యూ డైస్ వివరాలతో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. గడుపు ముగిసేలోగా విద్యార్థులు రుసుము చెల్లించేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలన్నారు.