WGL: కేవలం 5 నిమిషాల్లో లోన్ వస్తుందనే మాటలు నమ్మి, అపరిచితులకు మీ వివరాలు ఇవ్వద్దని WGL పోలీస్ కమిషనరేట్ పోలీసులు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ RBI అనుమతి లేని యాప్స్ ఇన్స్టాల్ చేయొద్దని, వాటి నుంచి లోన్ తీసుకోవోద్దని హెచ్చరించారు. ఎవరికి ఆన్లైన్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపించొద్దని సూచనలు చేశారు.