TG: పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారయింది. ఎల్లుండే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. డిసెంబర్ 11న మొదటిదశ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి, ఫలితాలు ప్రకటిస్తారు. నాలుగు రోజుల తేడాతో రెండు, మూడు దశల ఎన్నికలు నిర్వహిస్తారు.