HYD: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్తో పాటు ఆయా పార్టీల MPలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 46 అజెండాలపై సమావేశంలో చర్చలు జరపనున్నారు. జూబ్లీహిల్స్ MLA మాగంటి, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, అందెశ్రీ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించారు.