E.G: రాజానగరం మండలం కొండ గుంటూరులో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం సేకరణపై రైతులతో సమీక్షించారు. ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి సేకరణ జరిగిన 48 గంటల్లోనే చెల్లింపు చేస్తామని తెలిపారు.