MBNR: మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని విద్యారంగంలో మెరుగుపరుస్తామని పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో నూతనంగా నిర్మించనున్న ఇంజనీరింగ్, లా కళాశాల నిర్వహణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపకులపతి జిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.