KMM: సీపీఎం నేత సామినేని రామారావు హంతకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా సభ్యులు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. రామారావు హత్య చేసిన నేరస్తులను అరెస్ట్ చేయడంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఖండిస్తూ మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద చేపట్టిన మహా ధర్నాకు ఎర్రుపాలెం మండలం నుంచి నాయకులు భారీగా తరలి వెళ్లారు.