GNTR: రానున్న ఐదు సంవత్సరాల్లో రైతన్నను రాజులుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి తెలిపారు. మంగళవారం పెదకాకాని మండలం నంబూరులో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె రైతులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచసూత్రాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రమణ కుమార్ పాల్గొన్నారు.