అసోం ప్రముఖ సింగర్ జుబిన్ గార్గ్ (52) సింగపూర్లో ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జుబిన్ ప్రమాదంలో చనిపోలేదని అన్నారు. ఆయనను హత్య చేశారని అసెంబ్లీలో వెల్లడించారు.