NZB: పట్టణంలోని 39వ డివిజన్ బూత్ అధ్యక్షుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి పోతన్ కర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బూత్ కమిటీలు పటిష్టంగా ఉంటేనే పార్టీ బలపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటేశ్వర్ మండల అధ్యక్షుడు ఆనంద్, బూత్ కమిటీల ఇంఛార్జ్ సాయిరాం, 39వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ లతా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.