NDL: నవంబర్ 7న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నందికొట్కూరు మండలం ZPHS సమీపంలోని మద్యం దుకాణం విద్యార్థుల్లో చెడు అలవాట్లకు దారితీస్తోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. మద్యం దుకాణాన్ని తొలగించే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ SPని ఆదేశించారు.