జగిత్యాల పట్టణంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జిల్లాస్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలు సుమారు 200 క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో జగిత్యాల జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తారని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, సెక్రటరీ రఘుపతి నాయక్ తెలిపారు.