కడప: ప్రొద్దుటూరు జ్యువెలరీ వ్యాపారి తనికంటి శ్రీనివాసులు, ఆయన సోదరుడు వెంకటస్వామికి ప్రొద్దుటూరు మొదటి ADM కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జడ్జి సురేంద్రనాథ రెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. HYDకు చెందిన హేమంత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుపై బెదిరింపు, కిడ్నాప్, దాడి కేసుల్లో తనికంటి సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే.