E.G: రైతులు వద్ద నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాలకు సొమ్మును జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని AMC ఛైర్మన్ మార్ని వాసుదేవ్ అన్నారు. మంగళవారం రాజమండ్రి రూరల్ మండలం పిడింగోయ్యలో ‘రైతన్న మీకోసం’ వారోత్సవాలు నిర్వహించారు. వ్యవసాయ సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి నూతన విధానాలతో ముందుకు వెళ్తుందన్నారు.