AP: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ట్రస్టు బోర్డును ప్రభుత్వం నియమించింది. 15 మంది సభ్యులతో పాలకమండలి నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సభ్యులు రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారని వెల్లడించింది. పాలకమండలి ఛైర్మన్ ఎన్నికకు తగిన చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశించింది.