ADB: ఆధ్యాత్మిక తోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి బోజ రెడ్డి అన్నారు. భీంపూర్ మండలంలోని ధనోర వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో మంగళవారం డీసీసీబీ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.