హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలడంతో ఏర్పడిన బూడిద మేఘం భారత్ వైపు వస్తున్న నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్, దుబాయ్‌కు సంబంధించిన విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. వీటితో పాటు పలు దేశీయ విమాన సర్పీసులను కూడా రద్దు చేసినట్లు తెలిపింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది.