కడప: బద్వేల్ మండలంలోని తిరువెంగలాపురం పంచాయతీలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో బద్వేల్ టీడీపీ ఇంఛార్జ్ రితేశ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరిగి రైతులతో నేరుగా మాట్లాడి అన్నదాత సుఖీభవ నిధులు సకాలంలో జమయ్యాయా? ఏవైనా సాంకేతిక, పరిపాలన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.