HYD: హబ్సిగూడలోని శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని శ్రీ వైష్ణవి మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణం చెందగా, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఓయూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.