BDK: ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు అందేలా సంబంధిత యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ. రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ అధికారుల సమక్షంలో మారుమూల ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు.