ఓ వైపు శాంతి ప్రణాళిక ప్రతిపాదనలు సిద్ధమవుతోన్న వేళ కీవ్ సహా ఇతర ప్రాంతాలపై రష్యా దాడి చేసింది. రాజధానిలోని విద్యుత్ మౌలిక సదుపాయాలతో పాటు పలు భవనాలపై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఈ దాడి వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.