SKLM: నరసన్నపేటలో ఎక్కడ చూసినా శునకాల గుంపులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా పలు జంక్షన్లో వద్ద సంచరించటంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ వద్ద ఈ సంచారం ఎక్కువగా ఉండటంతో రోగులు సైతం అవస్థలు పడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.