VSP: విశాఖ రైల్వే స్టేషన్ మీద ట్రాఫిక్ భారం తగ్గించేందుకు రైల్వే శాఖ సబ్బవరం సమీపంలోని జగన్నాథపురం వద్ద కొత్త శాటిలైట్ స్టేషన్ను ప్రతిపాదించింది. కొత్తవలస- అనకాపల్లి మధ్య 35 కిమీ బైపాస్ లైన్ ప్రాజెక్టులో భాగంగా.. 563 హెక్టార్లు విస్తీర్ణంలో రూ.2,886.74 కోట్లతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఎంతో మేలు అవుతుందని రైల్వే శాఖ తెలిపింది.