JGL: ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను అందజేయడం జరుగుతుందని, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. భీమారం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళ తల్లులకు పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు పంపిణీ చేశారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.