ప్రకాశం: పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 10వ తరగతి ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్స్ సమయంలో ఇబ్బందులు ఉన్నచో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, ఏమైనా సందేహాలు ఉంటే 8985601722కు సంప్రదించాలని ఆయన కోరారు.