KMM: రఘునాథపాలెం మండలం చింతగుర్తికి చెందిన ములుగురు భాస్కర్ తన ఫోన్‌కు వచ్చిన ఏపీకే ఫైల్‌పై క్లిక్ చేయగానే ఆయన ఖాతాలో నగదును సైబర్ నేరగాళ్లు తస్కరించారు. ఈనెల 15న భాస్కర్ ఖాతా నుంచి రూ. 28,600 విత్ డ్రా అయ్యాయి. ఈ మేరకు అదేరోజు సైబర్ క్రైమ్ అధికారులకు సమాచారం ఇవ్వగా, సోమవారం తమకు ఫిర్యాదు చేశాడని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.