SKLM: కంచిలి మండలం అర్జునాపురం గ్రామానికి చెందిన కాయ ధనలక్ష్మీ (26) సోమవారం రాత్రి మృతి చెందారు. ఇచ్ఛాపురం మండలం మండపల్లి గ్రామానికి చెందిన కాయ శివతో ఈ ఏడాది మార్చి 7న వివాహం జరిగింది. డెలివరీ కోసం కన్నవారింటిలో ఉన్న సమయంలో నొప్పులు తాళలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సోంపేట ఇంఛార్జ్ ఎస్సై లవరాజు ఇవాళ తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.