MDK: వెల్దుర్తి మండలం ఎం.జలాల్పూర్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి కమ్మరి పాండరీకి చెందిన నివాస గృహంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.