MDK: చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ఈ మార్గంలో పెద్ద శివనూరు, చందంపేట ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోజువారీ ప్రయాణం కష్టతరంగా మారిందని, ఏ గుంతలో పడిపోతామో అన్న భయంతోనే ప్రయాణిస్తున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.