MDK: స్థానిక ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. జిల్లాలో ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ప్రకటించారు. దీంతో ఆశావాహులు తమకే మద్దతు ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. చిన్నాన్న-పెద్దబాపు, అక్కా-తమ్మడు మీ సపోర్టు ఇవ్వాలంటూ పలకరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది.