CTR: బెంగళూరు ఏటీఎం రాబరీ కేసుకు సంబంధించి కుప్పం (M) కుర్మాయిపల్లిలోని నవీన్ ఇంట్లో కర్ణాటక పోలీసులు సోమవారం రాత్రి మరో రూ.40 లక్షలు రికవరీ చేశారు. మూడు రోజుల క్రితం నవీన్ ఇంట్లో రూ.5.60 కోట్లు రికవరీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి నవీన్‌ను తమ వెంట తీసుకు వచ్చిన కర్ణాటక పోలీసులు ఇంట్లో దాచిపెట్టిన రూ.40 లక్షలు గుర్తించారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.