SKLM: పోలీసు సిబ్బంది వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కొత్తగా నిర్మించిన పోలీసు వెల్ఫేర్ పెట్రోల్ బంకును విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి సోమవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన డీఐజీకీ ఎస్పీ మాధవరెడ్డి, సహచర సిబ్బంది పూలమొక్కను అందజేసి, అపూర్వ స్వాగతం పలికారు.