JN: కొడకండ్ల మండలం నీలిబండ తండాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & గ్రామా పార్టీ ఇన్ఛార్జ్ సిందే రామోజీ స్థానిక నేతలతో మంగళవారం ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే ఆశావాహుల పేర్లను తీసుకున్నారు. ఎవరు నిలబడ్డా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.