AP: మాజీమంత్రి వేణుగోపాల్‌కు మంత్రి వాసంశెట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఆయన మతిస్థిమితం సరిగ్గా లేదనుకుంటా. ఖాళీగా కూర్చుని చర్చలకు రమ్మంటున్నారు. 2023లో శెట్టిబలిజ ఉపకులాలపై ఇచ్చిన మెమోపై ఆయన సమధానం చెప్పాలి. ఆ మెమో వల్ల శెట్టిబలిజ ఉపకులాల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకే మా ప్రభుత్వం జీవో నెం.16 తీసుకొచ్చింది. వైసీపీ పాలనలో శెట్టిబలిజ ఉపకులాలకు ఏం చేశారు?’ అని ప్రశ్నించారు.