గత 10 వేల సంవత్సరాల్లో తొలిసారిగా ఇథియోపియాలోని హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలిన విషయం తెలిసిందే. అయితే ఈ భారీ విస్పోటనం కారణంగా పెద్ద ఎత్తున వెలువడిన బూడిద భారత్ దిశగా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బూడిద మేఘం దూసుకొస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల విమాన సర్వీసులపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.