వరంగల్ జిల్లాలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమంలో భాగంగా, స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సత్య శారద ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత విభాగాధిపతులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు.