మహిళలపై ఆన్లైన్ వేధింపులకు వ్యతిరేకంగా నటి సమంత పోరాడేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఆమె ఐక్యరాజ్యసమితిలో భాగమైంది. మహిళలు, బాలికలపై డిజిటల్ హింసను అరికట్టేందుకు చేపట్టే అవగాహన కార్యక్రమంలో తన స్వరాన్ని వినిపించనుంది. నిన్నటి నుంచి DEC 10 వరకు 16 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో తాను భాగమైనట్లు సామ్ తెలిపింది.