AP: కృష్ణా జిల్లా వీరవల్లిలోని కృష్ణా మిల్స్ యూనియన్లో జాతీయ పాల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. కామధేను ప్రాజెక్టు యుటిలిటీ విభాగానికి రామోజీరావు పేరు అభినందనీయమని అన్నారు. సహకార వ్యవస్థలో రాజకీయం ఉండకూడదని సూచించారు. రైతుల ప్రగతి ఎజెండాగా పెట్టుకుని కోఆపరేటివ్ వ్యవస్థ ముందుకెళ్లాలన్నారు.