TG: ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ యాంటీ-డ్రోన్ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్ రేంజర్’ టీ హబ్లో ఆవిష్కృతమైంది. ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా రూపొందించిన ఈ వాహనాన్ని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే ప్రారంభించారు. భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడంలో ఇది ముఖ్యం అన్నారు. ఇది దేశ భద్రతలో కీలక ముందడుగని ఆయన ప్రశంసించారు.