ప్రకాశం: మార్కాపురం జిల్లాను స్వాగతిస్తున్నప్పటికీ, గిద్దలూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గిద్దలూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సాధన సమితి నాయకులు బుధవారం నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. తమ అభ్యర్థనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.