ELR: ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో 77వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం బుధవారం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీడీవో మనోజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రవేశ పీఠిక ప్రతిజ్ఞను అధికారులతో చేయించారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పెంపొందించుకుని ఉత్తమ పౌరులు ఎదగాలన్నదే లక్ష్యమని వారికి వివరించారు.