AP: రాష్ట్రానికి సెన్యార్ తుఫాన్ ముప్పు తప్పిందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్‌గా మారిన కొద్దిసేపట్లోనే ఇండోనేషియాలో తీరం దాటింది. దీంతో కోస్తా ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలు తుఫాన్ ముప్పు నుంచి బయటపడ్డాయి. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని IMD ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.