NLG: విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నల్గొండలోని కతాల్గూడ ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. తరగతి గదుల కొరత, మంచినీటి సమస్యలను మంత్రికి టీచర్లు వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి రెండు కొత్త తరగతి గదులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడిక్కడే శంకుస్థాపన చేశారు.