TG: ఎవరి ప్రయోజనాల కోసం GHMC విస్తరణ చేపట్టారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మున్సిపాలిటీల అభిప్రాయం తీసుకున్నారా..? అని నిలదీశారు. మాల్స్ కట్టుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకు భూమి ఇస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.