GNTR: తెనాలిలో దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ట్రాఫిక్ అంశంపై చర్చించేందుకు మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సబ్ కలెక్టర్ సంజనా సింహ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుందని, ఇందులో అన్ని విభాగాల అధికారులు పాల్గొంటారని కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ సమావేశం ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది.